
పినపాక నియోజకవర్గంలో వరుస రోడ్డు ప్రమాదాలు
మితిమీరిన వేగమే ఘటనలకు కారణం
రవాణాశాఖ, పోలీసులు దృష్టి సారిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట
మణుగూరు, మార్చి 27: వేగం, ఆపై మద్యం మత్తు.. ఇక చెప్పేదేముంది జీవితం చిత్తవుతోంది. ఒకటి కాదు రెండు వరుస ప్రమాదాలు జరిగినా వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా పినపాక నియోజక వర్గంలో మరణ మృదంగం మోగుతోంది పదిరోజులుగా నియోజక వర్గంలోని ఏదో ఒక మండలంలో ఎవరో ఒకరు మృత్యు ఒడికి చేరుతున్నారు. ఎక్కడ చూసినా కన్నుమూశారన్న వార్తలే వినబడుతున్నాయి. ఫలితంగా ప్జలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మణుగూరులో గత మూడు రోజుల్లో వరస మరణాలు చోటు చేసుకున్నా యి. ఇందులో ఇద్దరు ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోయారు. ఈఘటనలో తలలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు అశ్వాపురం చెందిన వీరేందర్, మరొకరు రైల్వే గేట్ కూనవరం వద్ద సొమవారం గేదను ఢీకొని నాగేశ్వరావు అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు. కరకగూడెం మండలం రేగేళ్ల వద్ద దేవాలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు అక్కడిక క్కడే మృత్యుఒడికి చేరుకున్నారు. అతివేగం వల్లే ప్రమాదా లు జరుగుతున్నాయి.
మద్యం మత్తే కారణం
ఇటీవల జరిగిన ప్రమాదాల్లో బాధితులంతా యువకులే. మద్యం తాగి, ఆ మత్తులో వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో మాదిరి ఇప్పుడు పోలీసులు వాహనాలను తనిఖీ చేయకపోతుండటంతో యువకుల వేగానికి అడ్డే లేకుండా పోతోంది. ముఖ్యంగా మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం, బూర్గంపాడులో ప్రమదాల తీవ్రత అధికంగా ఉంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మరమ్మతులు నిర్వహించడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. రోడ్ల దుస్థితిపై ఆర్అండ్బీ అధికారు లకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. గతంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేవారు. ఈ భయానికి ముఖ్యంగా మైనర్లు వాహనాలు తోలేందుకు భయపడే వారు. ఇటీవల తనిఖీల జాడ లేకపోవడంతో యువకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మణుగూ రు, అశ్వాపురం ప్రాంతాల్లో రాత్రిళ్లూ మద్యం తాగి రేస్ పోటీలను తలపించేలా బైక్లను తోలుతున్నారు. ఆ సమయంలో ఎవరైనా ఎదురుగా వస్తే అంతే సంగతులు.
ప్రమాదకరంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రోడ్డు
మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రధాన అంతర్గత రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. సీసీ రోడ్డే అయినప్పటికీ అది తన రూపాన్ని మార్చుకుం ది. రోడ్డంతా మట్టిరోడ్డును తలపించే విధంగా ఉంది. భారీ వాహానాల రాకపోకలతో రోడ్డు అంతా ఛిద్రంగా మారింది. దీనికి తోడు నీటిని ఈ రోడ్డుపై చిమ్మడంతో రోడ్డంతా బుర దమయంగా మారి ద్విచక్రవాహనాలు జారి పడిపోతు న్నాయి. విధులు నిర్వహించేందుకు వ చ్చే కార్మికులు ఉద్యోగులతో పాటు తమ అవసరాల నిమిత్తం వచ్చే పలు కంపెనీల వారు కూడా ఈ రహదారిపై రాకపోకలు జరుపుతూ తరచూ కింద పడి క్షతగాత్రులు అవు తున్నారు. రోజులో అనేక మంది పడిపోయి దెబ్బలు తింటున్నా పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడు. రోడ్డుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో కార్మికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చర్య లు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.