కంచికచర్ల రూరల్, మార్చి 26: కీసర గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగంగా నడపటంతోనే ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.