రాయదుర్గం నందిహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌ మృతి

Published: Sat, 23 Apr 2022 22:08:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్‌: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిహిల్స్ దగ్గర బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కానిస్టేబుల్‌ గోపాల్ కిందపడిపోయాడు. వెనక వైపు నుంచి వస్తున్న బస్సు బైక్‌ను ఢీకొనడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.