నేరాల నియంత్రణకే ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-20T05:20:50+05:30 IST

నేరాల నియంత్రణ కోసమే తరచూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు.

నేరాల నియంత్రణకే ఆకస్మిక తనిఖీలు
కాలనీ వాసులతో మాట్లాడుతున్న ఏసీపీ

- ఏసీపీ సారంగపాణి 

సుల్తానాబాద్‌, మే 19: నేరాల నియంత్రణ కోసమే తరచూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని మా ర్కండేయ కాలనీలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆ ప్రాంతాలలోని ఇండ్లలో సోదా లు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 89 ద్విచక్ర వాహనాలు, ఆటోలు పట్టుపడ్డాయి. వాటిని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా నిలువ చేసిన ఎనిమిది క్వింటాళ్ళ పీడీఎస్‌ బియ్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులనుద్దేశించి ఏసీపీ మాట్లాడుతూ నేరాల నియం త్రణ కోసమే ఇలాంటి తనిఖీలు చేస్తున్నామన్నారు. ప్ర జల రక్షణ, ప్రజలకు భద్రత కల్పించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీషీటర్లకు, సస్పెక్ట్‌ షీట్స్‌ ఉన్నవారికి ప్రత్యే క కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారి ఇండ్లను కూడా సోదా చేశారు. సం ఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. కాలనీకి ఎవరై నా కొత్త వ్యక్తుల వస్తే వారి వివరాలను వెంటనే పోలీసులకు తెలి యజేయాలని, లేదా వంద నంబర్‌కు డయల్‌ చేయాలన్నారు. కాల నీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ప్రజలకు తగిన రక్షణ ఉంటుందన్నారు. కౌన్సిలర్‌ చింతల సునితరాజు సీసీ కెమెరాల ఏర్పాటుకు 25 వేల రూపాయలను అందజేశారు. కాలనీ వాసులు అందరూ కలిసి మరో ఎనిమిది కెమెరాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  సుల్తానాబాద్‌ పెద్దపల్లి సీఐ లు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్‌ కుమార్‌, మున్సిపల్‌  చైర్‌ పర్సన్‌ సునిత, సర్కిల్‌ పరిదిలోని ఎస్‌ఐలు ఉపేందర్‌, వినీత, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌, వెంకటకృష్ణ, రాజవర్ధన్‌, శివాని, రవీందర్‌, మరో 70 మంది సిబ్బం ది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:20:50+05:30 IST