చాయ్‌ అమ్ముతూ బంగారం దొంగతనం

ABN , First Publish Date - 2022-05-12T16:28:23+05:30 IST

చాయ్‌ అమ్ముతూ బంగారం దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.50లక్షల విలువగల బంగారు

చాయ్‌ అమ్ముతూ బంగారం దొంగతనం

                   - నిందితుడి అరెస్టు... రూ.3.50లక్షల సొత్తు స్వాధీనం


హనుమకొండ: చాయ్‌ అమ్ముతూ  బంగారం దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.50లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మట్టెవాడ సీసీఎస్‌లో ఏసీపీ డేవిడ్‌రాజు వివరాలను వెల్లడించారు.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం హుబ్లి జిల్లాకు చెందిన షేక్‌మిరాజ్‌ బతుకుదెరువు కోసం వరంగల్‌కు వచ్చారు. ఆటోనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ నగరంలో తిరుగుతూ టీ అమ్ముతుండేవాడు. తాగుడు, జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఈ క్రమంలో బంగారం షాపులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈనెల 6వ తేదీన వరంగల్‌ నిజాంపురలోని ఓ బంగారం షాపు వద్దకు వెళ్లగా యజమాని వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన షేక్‌మిరాజ్‌.. కౌంటర్‌ మీద ఉన్న తాళం చెవితో బీరువాలో ఉన్న సుమారు 70 గ్రాముల బంగారు ఆరణాలను తస్కరించాడు. షాపు యజమాని ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఎత్తుకెళ్లిన బంగారాన్ని షేక్‌మిరాజ్‌ అమ్మేందుకు బుధవారం వరంగల్‌ బులియన్‌ మార్కెట్‌కు వస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. కేసును ఛేదించిన వారిలో సీసీఎస్‌ ఎన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, ఎల్‌. రమే్‌షకుమార్‌, ఎస్‌ఐ యాదగిరిరావు, ఏస్సైలు  శివకుమార్‌, గోపాల్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు జంపన్న, సుధాకర్‌, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌, నజీరుద్ధీన్‌లను సీపీ తరుణ్‌జోషి అభినందించారు.


Read more