సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోవింద్
టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుడుమూరు గోవింద్
విశాఖపట్నం, మే 21: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుడుమూరి గోవింద్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేఖ రులతో మాట్లాడారు. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ను బలవంతంగా ఎత్తుకు వెళ్లి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారన్నారు.
తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని చూసి వీలుకాకపోవడంతో మృతదేహానిన కారులో వదిలి పారిపోయారన్నారు. గతంలో అనంతబాబు అసాంఘిక కార్యకలాపాలకు సుబ్రహ్మణ్యం ప్రత్యక్ష సాక్షి కాబట్టే అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. తక్షణం ఈ హత్యకు బాధ్యులను అరెస్టు చేయాలన్నారు. వైసీపీ హయాంలో దళితులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయన్నారు. సమా వేశంలో పసర్లపూడి జయారాజ్ పాల్గొన్నారు.