Karnataka: లింగాయత్ మఠం స్కూలు బాలికలపై అత్యాచార పర్వం

ABN , First Publish Date - 2022-09-02T16:59:42+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ మఠం స్కూలు హాస్టల్ బాలికలపై అత్యాచారపర్వం సాగింది....

Karnataka: లింగాయత్ మఠం స్కూలు బాలికలపై అత్యాచార పర్వం

మఠాధిపతి,హాస్టల్ వార్డెన్‌తోపాటు ఐదుగురిపై కేసు...జ్యూడిషియల్ కస్టడీకి తరలింపు

బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ మఠం స్కూలు హాస్టల్ బాలికలపై అత్యాచారపర్వం సాగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. మఠం పాఠశాల హాస్టల్‌లో ఉన్న ఇద్దరు బాలికలపై సాక్షాత్తూ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు అత్యాచారం చేశారని పోలీసులు నమోదు చేసిన కేసులో అతన్ని అరెస్టు చేసి 14 రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి పంపించారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.శివమూర్తిని వైద్య పరీక్షల కోసం చిత్రదుర్గలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆపై విచారణ కోసం అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.


శుక్రవారం మఠాధిపతిని చిత్రదుర్గ కోర్టులో పోలీసు రిమాండ్ కోరనున్నారు.మఠంలో తమపై అత్యాచారం జరిగిందని పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో మఠాధిపతి,హాస్టల్ వార్డెన్‌తో సహా మొత్తం ఐదుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అంతకుముందు అత్యాచారం కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల ఇద్దరు బాలికలను మూడున్నరేళ్లకుపైగా లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


లింగాయత్‌ పీఠాధిపతిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో మఠానికి చెందిన బాలికలను ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు.ఆగ్రహావేశాల మధ్య చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న దావణగెరె జిల్లా నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.




Updated Date - 2022-09-02T16:59:42+05:30 IST