Girlపై అఘాయిత్యం కేసులో 30 రోజుల్లోనే ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-11-12T12:47:03+05:30 IST

నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ సూరత్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది....

Girlపై అఘాయిత్యం కేసులో 30 రోజుల్లోనే ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

దోషికి జీవితఖైదు...లక్షరూపాయల జరిమానా

సూరత్ (గుజరాత్): నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ సూరత్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అరెస్టయిన నెల రోజుల్లోనే అత్యాచారం కేసులో దోషి  అయిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అజయ్ నిషాద్ (39)కి ప్రత్యేక న్యాయమూర్తి పిఎస్ కాలా జీవిత ఖైదు విధించారు.దీంతో పాటు దోషి లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని జడ్జి ఆదేశించారు. అక్టోబరు 12వతేదీన జీఐడీసీ ప్రాంతంలోని ఇంటివద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశారు. 



బాలిక నిర్జన ప్రదేశంలో దొరికింది.నిందితుడు అయిన నిషాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేవలం పదిరోజుల్లోనే చార్జ్ షీటు దాఖలు చేశారు. దీంతో కోర్టు అక్టోబరు 25వతేదీ నుంచి ఐదు రోజుల్లోనే విచారణను ముగించి దోషికి శిక్ష విధించింది.ప్రాసిక్యూషన్ ప్రకారం గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి.కొన్ని రోజుల్లో అర్దరాత్రి 12 గంటల వరకు కోర్టు పని చేసిందని ఓ న్యాయవాది తెలిపారు.

Updated Date - 2021-11-12T12:47:03+05:30 IST