
విజయవాడ: బలహీన వర్గానికి చెందిన అయ్యన్న కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కక్షతోనే ఇంటి గోడను కూల్చారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నించినందుకే జగన్రెడ్డి కక్ష సాధిస్తున్నారన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. గోడను కూల్చే నిమిషం ముందు నోటీస్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమండ్ చేశారు.