
Amaravathi: సీనియర్ పాత్రికేయులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, ప్రముఖ రచయిత సి.నరసింహారావు మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు Achennaidu అన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని, ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుకని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండించిన వ్యక్తి అని అన్నారు. నరసింహారావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇవి కూడా చదవండి