చిరిగిన చీరలో అచింత పతకాలు!

Published: Thu, 11 Aug 2022 03:21:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిరిగిన చీరలో అచింత పతకాలు!

కోల్‌కతా: కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన అచింత షూలే ఇంట్లో.. అతడు సాధించిన పతకాలను పెట్టుకోవడానికి ఓ అల్మారా కూడా లేదని అతడి తల్లి పూర్ణిమ తెలిపింది. అందుకే అచింత సాధించిన పతకాలు, షీల్డ్‌లను మంచం కింద చిరిగిన చీరలో చుట్టి దాచిపెట్టేదాన్నని చెప్పింది. అతడు ఇంటికి తిరిగి రావడంతో.. ఆ మెడల్స్‌ను ఓ స్టూల్‌పై పెట్టింది. ‘నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత మీడియా తాకిడి ఉంటుందని తెలుసు. అందుకే వాటిని స్టూల్‌పై పె ట్టా’ అని పూర్ణిమ చెప్పింది. అయితే, తన కొడుకు సాధించిన పతకాలు, షీల్డ్‌లను అందరికీ కనిపించేలా ఉంచేందుకు ఓ కప్‌బోర్డ్‌ను ఖరీదు చేయమని అచింతకు చెప్పింది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.