అతిగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..?

ABN , First Publish Date - 2021-11-25T19:43:22+05:30 IST

ఛాతీలో మంట, అసౌకర్యం, పుల్లని త్రేన్పులు... ఈ అసిడిటీ లక్షణాలు ప్రతి ఒక్కరికీ అనుభవమే! అయితే వీటి నుంచి ఉపశమనం దక్కాలంటే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి.

అతిగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..?

ఆంధ్రజ్యోతి(25-11-2021)

ఛాతీలో మంట, అసౌకర్యం, పుల్లని త్రేన్పులు... ఈ అసిడిటీ లక్షణాలు ప్రతి ఒక్కరికీ అనుభవమే! అయితే వీటి నుంచి ఉపశమనం దక్కాలంటే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. 


అసిడిటీ వచ్చిన తర్వాత చికిత్సలను ఆశ్రయించేకంటే, అసిడిటీ తలెత్తకుండా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం...


అతిగా తినడం మానేయాలి. పుల్లని పండ్లను తినడం తగ్గించాలి.


దీర్ఘ సమయం పాటు ఆహారం తినకుండా ఉండడం వల్ల అసిడిటీ తలెత్తుతూ ఉంటే, అలాంటి అలవాటు మానుకోవాలి. వేళకు ఆహారం తీసుకుంటూ, రాత్రివేళ పెందలాడే భోజనం ముగించాలి.


తిన్న వెంటనే పడుకోవడం మానేయాలి.


ధూమపానం, మద్యపానం, టీ, కాఫీలు మానుకోవాలి.


ఒత్తిడి తగ్గించుకోవాలి.


పులియబెట్టిన పదార్థాలు, వేపుళ్లు, పుల్లని, ఘాటైన, కారంతో కూడిన పదార్థాలు తగ్గించాలి. 


వెల్లుల్లి, ఉప్పు, నూనె, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడిన పదార్థాలకు దూరంగా ఉండాలి.


చిట్కాలు ఇవే!


పుదీనా: అసిడిటీ మొదలైనప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే గ్లాసు నీళ్లలో పది పుదీనా ఆకులు వేసి, మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు, తేనె కలిపి తాగాలి. దీన్లో కొంత అల్లం రసం కూడా కలుపుకోవచ్చు.


జీలకర్ర: నీళ్లలో స్పూను జీలకర్ర వేసి మరిగించి, చల్లారిన తర్వాత తాగాలి.


లవంగాలు: అసిడిటీ మొదలైన వెంటనే నోట్లో లవంగాలు వేసుకుని, నములుతూ రసం మింగుతూ ఉండాలి.


సోంపు: తిన్న వెంటనే అర టీస్పూను సోంపు నోట్లో వేసుకుని నమలాలి.


ఎండుద్రాక్ష: ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగాలి.


పాలు: రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూను ఆవు నెయ్యి కలిపి తీసుకోవాలి.


పళ్లు: తీయని దానిమ్మ, అరటిపళ్లు అప్రికాట్స్‌, కొబ్బరి అసిడిటీకి విరుగుడుగా పని చేస్తాయి.


ఉసిరి: 15 - 20 మిల్లీలీటర్ల ఉసిరి రసాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. అదే పొడి రూపంలో ఉన్నదైతే, భోజనానికి ముందు అర టీస్పూను చొప్పున రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.


ప్రాణాయామం: అనులోమ విలోమ, భ్రమరి సాధన చేయాలి.


ఆయుర్వేద చికిత్సలు


శతావరి: రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు ఒక టీస్పూను చొప్పున తీసుకోవాలి. 


యష్ఠిమధు: రోజుకు రెండు సార్లు మూడు గ్రాముల చొప్పున పాలతో కలిపి తీసుకోవాలి.


సొంఠి: 1 - 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

Updated Date - 2021-11-25T19:43:22+05:30 IST