సామాజిక బాధ్యతగా పనిచేయండి

ABN , First Publish Date - 2021-04-17T05:30:00+05:30 IST

రోనా నియంత్రణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ సూచించారు. కొవిడ్‌ నియంత్రణకు అనుసరించాల్సి ప్రత్యేక కార్యాచరణపై శనివారం సాయంత్రం ఆయా శాఖ అధికారు లతో సమీక్షించారు.

సామాజిక బాధ్యతగా పనిచేయండి
సమీక్షలో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి సత్యనారాయణ



కలెక్టరేట్‌: కరోనా నియంత్రణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కొవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ  సూచించారు. కొవిడ్‌ నియంత్రణకు అనుసరించాల్సి ప్రత్యేక కార్యాచరణపై శనివారం సాయంత్రం ఆయా శాఖ అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటా సర్వే చేసి వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలన్నారు. హోమ్‌ ఐసో లేషన్‌, క్వారంటైన్‌కు తరలించాలన్నారు. వైరస్‌ సామాజికంగా విస్తరించకుండా కఠినచర్యలు తీసుకోవాలన్నారు.  కలెక్టరు హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి 3 గంటల్లో కిట్లు, అవసరమైన వారికి 3 గంటల్లో ఆసుపత్రిలో పడకలను కేటాయించడానికి చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. కంటైన్మెంట్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. జేసీలు మహేష్‌కుమార్‌, కిషోర్‌కుమార్‌, వెంకట రావు, సబ్‌ కలెక్టర్‌ విదేఖారే, డీఆర్‌వో గణపతిరావు , ఏఎస్‌పీ సత్యనారాయణ, ఆర్‌డీవో భవానీశంకర్‌ పాల్గొన్నారు.





Updated Date - 2021-04-17T05:30:00+05:30 IST