బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-24T03:38:27+05:30 IST

ఆదివాసీ సీడాం వంశీయుల కులదైవం పేర్సాపేన్‌ దేవాల య స్థలాన్ని కూడా వదలకుండా పీసాయాక్టుకు విరుద్ధంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ యువజన నా యకుడు సిడాం మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భవన ని ర్మాణ విషయంలో గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ అధికారికి ఫిర్యాదు చేయనున్న ట్లు చెప్పారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఇచ్చోడ, ఏప్రిల్‌23: ఆదివాసీ సీడాం వంశీయుల కులదైవం పేర్సాపేన్‌ దేవాల య స్థలాన్ని కూడా వదలకుండా పీసాయాక్టుకు విరుద్ధంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ యువజన నా యకుడు సిడాం మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భవన ని ర్మాణ విషయంలో గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ అధికారికి ఫిర్యాదు చేయనున్న ట్లు చెప్పారు. మండల కేంద్రంలో సీడాం వంశీయుల దేవాలయం ఉండగా, మ రో రెండు ఆలయాలు మహారాష్ట్రలో ఉన్నాయని తెలిపారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులతో పంచాయతీ అధికారులు కుమ్మక్కై ఆదివాసీల దేవాలయాల స్థలాలను కబ్జా చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్వవహరిస్తున్నారని ఆ రోపించారు. ఈ అక్రమ నిర్మాణంపై కలెక్టరును కలిసి ఫిర్యాదు చేయనున్నామ ని తెలిపారు. పేర్సాపేన్‌ దేవాలయానికి ప్రతీ సంవత్సరం మహారాష్ట్ర నుంచి, జిల్లాలోని సీడాం వంశీయుల కోడళ్లతో ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు అ లాంటి పవిత్ర దేవాలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌టీఆర్‌ భూముల్లో గిరిజనేతరులు ఆక్రమిం చి పెసాయాక్టుకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా పంచాయతీ అ ధికారులు చోద్యం వహిస్తున్నారని అన్నారు. ఇచ్చోడ మండలకేంద్రంలో వందల ఎకరాల భూముల ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో గిరిజనేతరులు భవన ని ర్మాణాలు చేపడుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T03:38:27+05:30 IST