యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి : బీజేపీ

Jul 25 2021 @ 00:30AM
మాదాపూర్‌, జాఫ్రాపూర్‌ రోడ్డును పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

సోన్‌, జూలై 24 : జిల్లాలో పరదలతో నష్టపోయిన ప్రాంతంలో యుద్ధ ప్రాతి పదికన చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తిలు అన్నారు. శనివారం మండలంలోని మాదాపూర్‌, జాఫ్రాపూర్‌ గ్రామాల్లో వర్షంతో దెబ్బతిన్న పంటలను, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా వరద తాకిడికి రైతుల పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతినడం జరిగిందన్నారు. నష్టపోయిన రైతుల పంటలకు ఎక రానికి ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేని యెడల పెద్ద మొత్తంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మ్యాక ప్రేమ్‌ కుమార్‌, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, శ్రావణ్‌ రెడ్డి, కత్తి నరేందర్‌, సాదం అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on: