పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-07T06:38:15+05:30 IST

జిల్లా కేంద్రానికి చెందిన రొయ్య శ్రీనివా్‌సను టూటౌన్‌ పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌ డిమాండ్‌చేశారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీఎస్పీ నాయకులు

బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

సమగ్ర విచారణ చేస్తాం: ఎస్పీ


నల్లగొండ క్రైం, డిసెంబరు 6: జిల్లా కేంద్రానికి చెందిన రొయ్య శ్రీనివా్‌సను టూటౌన్‌ పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్‌ డిమాండ్‌చేశారు. బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ పోలీసులు కొట్టడంతోనే శ్రీనివాస్‌ కాలు విరిగిందని ఆరోపించారు.  కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌, రాజు, భీమ్‌ప్రసాద్‌, శ్రీనివాస్‌, కవిత, యాదగిరి, గోవర్థన్‌, కృష్ణ, రమేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ విషయంపై బాధితుడు రొయ్య శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రొయ్య శ్రీనివాస్‌ నల్లగొండలోని పద్మానగర్‌లో నకిలీ పత్రాలు చూపించి తమకు ప్లాట్‌ విక్రయించి మోసం చేశాడని బుడమర్లపల్లికి చెందిన పంతంగి రమాదేవి సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు. అంతేగాక పలువురు శ్రీనివాస్‌ బాధితులు ఎస్పీని కలిసినట్లు తెలిసింది. దీనిపై ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ మాట్లాడుతూ, కొందరి ఫిర్యాదుమేరకు శ్రీనివాస్‌పై చీటింగ్‌ కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి పోలీసుల తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.


రోడ్డును కబ్జా చేసిన  వారిపై చర్య తీసుకోవాలి 

రామగిరి: పట్టణంలోని పద్మనగర్‌ కాలనీ మేరుసంఘ భవనం సమీపంలో రోడ్డును కబ్జా చేసి ప్లాటుగా విక్రయించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని కాలనీకి చెందిన గాలయ్య, లచ్చురాంనాయక్‌, శంకర్‌ డిమాండ్‌ చేశారు. కాలనీలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007లో కొనుగోలు చేసిన ప్లాట్లను బొంత రాజశేఖర్‌, బొంత శ్రీను అనే వ్యక్తులు ఆక్రమిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాక కాలనీ రోడ్డును ఆక్రమించి ప్లాట్లుగా చూపించి విక్రయించారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో స్థానికులు మీసం నాగరాజు, జాల సుధాకర్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:38:15+05:30 IST