గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

Dec 7 2021 @ 01:10AM
గుంజలూరులో వెంచర్‌ ఎదుట ధర్నా చేస్తున్న వార్డు సభ్యులు, గ్రామస్థులు

చివ్వెంల, డిసెంబరు 6: నిబంధలను పట్టించుకోని మండలంలోని గుంజలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని కోరుతూ ముగ్గురు వార్డు మెంబర్లు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. అదే గ్రామంలోని ఓ వెంచర్‌ ఎదుట సోమవారం ధర్నా చేసి మాట్లాడారు.  12 ఎకరాల్లో వెంచర్‌కు అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో అభివృద్ధి తీసుకుంటున్నా  కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేద న్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి బక్కయ్యను వివరణ కోరగా వెంచర్‌ అనుమతుల వివరాలను వార్డు సభ్యులకు తెలిపానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంకరి ఉపేందర్‌, బొల్లికొండ సైదులు, ఐతరాజు రాంమళ్లు, గ్రామస్థులు పెదపోలు వీరయ్యగౌడ్‌, మొలుగూరి మదు, పవన్‌, కొప్పు లక్ష్మయ్యలు పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.