ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-12T06:59:49+05:30 IST

పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో గల ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఖానాపూర్‌ వీడీసీ అధ్యక్షులు బీసీ రాజన్న డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఖానాపూర్‌లో ఆందోళన చేస్తున్న వీడీసీ బృందం

ఖానాపూర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో ఆందోళన 

ఖానాపూర్‌, మే 11 : పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో గల ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఖానాపూర్‌ వీడీసీ అధ్యక్షులు బీసీ రాజన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం శాంతినగర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. గతంలో ఈ స్థలంలో ప్రభుత్వాసుపత్రి నడిచేదని ఆతర్వాత ఖానాపూర్‌లో నూతన గ్రంథాలయం కోసం కేటాయిస్తూ అప్పట్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేశామని మాజీ సర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు. గతంలోనే ఈ స్థలం ఆక్రమణకు గురౌ తోందని తాము మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించకోవడం లేదని వీడీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి మున్సిపల్‌ చైర్మన్‌ బంధువు కావడంతోనే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మాజీ సర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ప్లోర్‌లీడర్‌ రాజూరా సత్యంలు ఆరో పించారు. వెంటనే ఈ స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసు కోవాలని డిమాండ్‌ చేశారు. సదరు స్థలంలో ఇదివరకే చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సదరుస్థలంలో కరెంటు మీటరు ఏర్పా టు చేసిన విద్యుత్‌ అధికారులను నాయకులు నిలదీశారు. దీంతో వెంటనే విద్యుత్‌ శాఖాధికారులు కరెంటు మీటరును తొలగించారు. ఈ ఆందోళనలో వీడీసీ ప్రధాన కార్యదర్శి ద్యావతి రాజేశ్వర్‌, కొత్తపెల్లి సురేష్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు కడార్ల గంగనర్సయ్య, లక్ష్మణ్‌రావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అబ్దుల్‌ఖలీల్‌, కౌన్సిలర్‌లు కుర్మశ్రీనివాస్‌, సంతోష్‌, గుగ్లావత్‌ కిషోర్‌నాయక్‌, మాజీ సర్పంచ్‌ బక్కశెట్టి లక్ష్మణ్‌, ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నందిరామయ్య, పీఏసీఏస్‌ కరిపె శ్రీనివాస్‌, దాసరి రాజన్న, కొండాడి గంగారావు, నాగేందర్‌, షభ్బీర్‌పాషా, అల్లాడి వెంకటేశ్వర్లు, మదిరె సత్య నారాయణ తదితరులున్నారు. 

Read more