అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-07-01T05:40:18+05:30 IST

అంగన్‌వాడీ వర్కర్లు అక్ర మాలకు పాల్పడితే వారి పై చర్యలు తీసుకొంటా మని ఇన్‌చార్జి సూపర్‌ వైజర్‌ జయమ్మ పేర్కొ న్నారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

గుర్రంకొండ, జూన్‌ 30: అంగన్‌వాడీ వర్కర్లు అక్ర మాలకు పాల్పడితే వారి పై చర్యలు తీసుకొంటా మని ఇన్‌చార్జి సూపర్‌ వైజర్‌ జయమ్మ పేర్కొ న్నారు. గురువారం ‘ఆం ధ్రజ్యోతి’ దినపత్రికలో ‘దుకాణాల్లో జగనన్న పాలు’ అన్న శీర్షిక ప్రచురి తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె టి.రాచపల్లె, రామాపురం అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే పిల్లల హాజరును తనిఖీ చేసి వారికి అందిస్తున్న మెనూను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ పిల్లల పౌష్ఠికాహారం బయట దుకాణాల ఎలా దొరకుతున్నాయంటూ సిబ్బందిపై మండిపడ్డారు. పిల్లల పౌష్ఠికా హారం పక్క దారిపడితే సంబంధిత వర్కర్లపై కఠిన చర్యలు ఉంటాయ న్నారు. మండలంలోని అన్ని కేంద్రాలను తనిఖీ చేసి పిల్లలకు పౌష్ఠికా హారం పక్కాగా అందలే చూస్తామని తెలిపారు. 


Updated Date - 2022-07-01T05:40:18+05:30 IST