నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-14T10:18:47+05:30 IST

అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, కల్లాల నిర్మాణం తదితర అంశాలపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాల ఎంపికలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీఆర్‌డీవో పీడీ ప్రశాంత్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి పాల్గొన్నారు. 


మొయినాబాద్‌ ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీసు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొయునాబాద్‌ ఎంపీడీవో విజయలక్ష్మికి షోకాజు నోటీసు జారీ చేశారు. అలాగే ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో షోకాజ్‌ నోటీసుకు మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - 2020-07-14T10:18:47+05:30 IST