పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-05-29T05:24:35+05:30 IST

మద నపల్లె పట్టణంలోని వార్డు సచి వాలయాల్లో సిబ్బంది పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్ప వని ఆర్డీవో ఎంఎస్‌ మురళి హెచ్చరించారు.

పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు
రామ్‌నగర్‌ సచివాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన్‌, మే 28: మద నపల్లె పట్టణంలోని వార్డు సచి వాలయాల్లో సిబ్బంది పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్ప వని ఆర్డీవో ఎంఎస్‌ మురళి హెచ్చరించారు. శనివారం పట్ట ణంలోని రామ్‌నగర్‌, గొల్లపల్లె రింగ్‌రోడ్డు, రామారావు కాలనీ లోని వార్డు సచివాలయాలను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా గ్రామ పోలీ సు, హెల్త్‌ అసిస్టెంట్‌లను పలు అంశాలపై ప్రశ్నించారు. వారిద్దరు పొంతనలేని సమా ధానాలు చెప్పడంతో ఆర్డీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతా, శిశువుల ఆరోగ్యం, పౌష్టికాహారం పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్విరాన్‌మెంట్‌ అసిస్టెంట్లు ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ మురుగుకాలువల్లో చెత్తవేస్తున్న ప్రజలకు అవగాహన కల్పిం చాలని, వినకుంటే జరిమానా విధించాలని సూచించారు. వార్డు సచివాలయాల్లో తర చుగా వచ్చి తనిఖీలు చేస్తానని, సక్రమంగా విధులు నిర్వహించని వారిపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. కాగా 6వ వార్డు కౌన్సిలర్‌ లత భర్త సుధాకర్‌ సచివాల యానికి వచ్చి ప్రజల సమస్యలపై ఆర్డీవోకు వివరించారు.


Updated Date - 2022-05-29T05:24:35+05:30 IST