నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-12-06T05:18:38+05:30 IST

జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఏపీసి డాక్టర్‌ బి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఒంగోలులోని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో కేజీబీవీ ప్రిన్సిపాళ్ళతో సమీక్షా సమా వేశం నిర్వహించారు.

నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే చర్యలు

ఏపీసి బి.శ్రీనివాసరావు 


ఒంగోలువిద్య, డిసెంబరు 5 : జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఏపీసి డాక్టర్‌ బి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఒంగోలులోని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో కేజీబీవీ ప్రిన్సిపాళ్ళతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల కు భోజనం అందించే విషయంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. గ్రంథాలయం లోని పుస్తకాలను ప్రతి విద్యార్థిని చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమా వేశంలో జీసీడీవో వసంతకుమారి, ఏజీసీడీవో మాధవీలత పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:18:38+05:30 IST