ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-12T04:20:58+05:30 IST

రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. మండల వ్యవసాయ అధికారి మార్క్స్‌గ్లాడ్సన్‌తో కలిసి బుధవారం ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె పరిశీలించారు. ఎరువులు, విత్తనాల స్టాక్‌ రిజిష్టర్‌లను తనిఖీ చేశారు.

ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ఎరువుల దుకాణంలో స్టాకు వివరాలు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి కల్పన

- జిల్లా వ్యవసాయాధికారి కల్పన

భీమారం, మే 11 : రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. మండల వ్యవసాయ అధికారి మార్క్స్‌గ్లాడ్సన్‌తో కలిసి బుధవారం ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె పరిశీలించారు. ఎరువులు, విత్తనాల స్టాక్‌ రిజిష్టర్‌లను తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫెర్టిలైజర్‌ షాపుల యాజమానులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. జీలుగ విత్తనాలను ప్రతీ రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు తీసు కుని భద్ర పరుచుకోవాలని సూచించారు. అనంతరం మండల కేం ద్రంలోని రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో  వ్యవ సాయ సాంకేతిక అధికారి శ్రీనివాస్‌,  ఏఈవో అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more