నిర్లక్ష్యం చేస్తే చర్యలు : జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2021-01-24T05:53:21+05:30 IST

ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి పనులను తలపెట్టిందని, ఈ పనులను వేగంగా, నాణ్యతగా చేయించాలని జడ్పీ సీఈవో కిషన్‌ అధికారులను ఆదేశించారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు : జడ్పీ సీఈవో
బీంపూర్‌లో నర్సరీలను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో

భీంపూర్‌, జనవరి 23: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి పనులను తలపెట్టిందని, ఈ పనులను వేగంగా, నాణ్యతగా చేయించాలని జడ్పీ సీఈవో కిషన్‌ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం భీంపూర్‌, మర్కగూడ, వడ్‌గావ్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామలు, రైతు వేదికలను పరిశీలించిన తర్వాత మండల పరిషత్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడు తూ గ్రామాలలోఉపాధి హామీ పనులను పారదర్శకం గా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ కుంరా సుధాకర్‌, ఎంపీపీ కుడిమెత రత్నప్రభసంతోష్‌, సర్పంచ్‌ మడావి లింబాజి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వినోద్‌, ఈజీఎస్‌ ఈసీ నరేందర్‌ ఉన్నారు.

Updated Date - 2021-01-24T05:53:21+05:30 IST