Advertisement

రెమ్‌డెసివర్‌ బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు

Apr 22 2021 @ 23:49PM

ఖిల్లా, ఏప్రిల్‌ 22 : కొవిడ్‌ చికిత్సలకు ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివర్‌ బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. చికిత్సల కోసం వచ్చే రోగుల సైతం ప్రత్యేకంగా బిల్లులను తీసుకోవాలని సూచించారు. రాను న్న మూడు వారాల్లో కీలకంగా ఉన్నందున కొవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్‌బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రెమ్‌డెసివర్‌ను కొనుగోలు చేయాలన్నారు. జిల్లాకేంద్రంలో ప్రస్తుతం 15 ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌ కొరత లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సీజన్‌ను సమకూరుస్తున్నామని వారు తెలిపారు. 

క్ర.సం. బ్రాండ్‌ పేరు మునుపటి ధరలు   మార్చిన (ప్రస్తుత) ధరలు

1 రెమ్‌డాక్‌ 2800     899

2 రెమ్‌విన్‌ 3950     2450

3 రెడీక్స్‌          5400     2700

4 సీప్రెమి         4000     3000

5 డిస్రెమ్‌         4800     3400

6 జూబీ.ఆర్‌ 4700     3400

7 కోవిఫర్‌         5400     3490


Follow Us on:
Advertisement