వారంలో నాడు నేడు పనులు పూర్తికాకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-07-27T05:48:42+05:30 IST

మండలంలోని టోకూరు బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను వారం రోజుల్లో పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటానని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ పాఠశాల హెచ్‌ఎం మన్మథరావును హెచ్చరించారు.

వారంలో నాడు నేడు పనులు  పూర్తికాకుంటే చర్యలు
టోకూరు పాఠశాల హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పీవో గోపాలకృష్ణ



టోకూరు పాఠశాల హెచ్‌ఎంపై పీవో గోపాలకృష్ణ ఆగ్రహం

అనంతగిరిరూరల్‌, జూలై 26: మండలంలోని టోకూరు బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను వారం రోజుల్లో పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటానని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ పాఠశాల హెచ్‌ఎం మన్మథరావును హెచ్చరించారు. సోమవారం టోకూరు బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను పీవో పరిశీలించారు. పనులు పూర్తికాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, రంగులు అసంపూర్తిగా ఉండడంపై పీవో మండిపడ్డారు. పాఠశాల ఉపాధ్యాయులందరికీ విధులను కేటాయించి ఏడు రోజుల్లో రేయింబవళ్లు పనులు చేయించి పాఠశాల రూపురేఖలను మార్చాలని ఆదేశించారు. సహాయ గిరిజన సంక్షేమాధికారి ప్రతీరోజు పాఠశాలలోనే ఉండి పనులను పూర్తిచేయించాలని సూచించారు. నాణ్యత తగ్గితే చర్యలు ఉంటాయన్నారు. వారం రోజుల్లో పనులు పూర్తి కాకుంటే పది నెలలపాటు జీతాలు నిలుపుదల చేస్తానని హెచ్చరించారు. అనంతరం సచివాలయం, రైతుభరోసా భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ శ్రీనివాస్‌, డీఈఈ వంశీ, ఏఈ అప్పలనాయుడు, ఏటీడబ్ల్యూఓ వైకుంఠరావు, ఎంఈఓ వెంకటరావు, సర్పంచ్‌ మొస్య, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-27T05:48:42+05:30 IST