ఉపాధిహామీ సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

ఉపాధిహామీ సిబ్బంది తమ పనితీరును మార్చుకోకుంటే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉపాధిహామీ సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు
ఖేడ్‌ ఎంపీపీ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ఖేడ్‌ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 

నారాయణఖేడ్‌, జూలై 23: ఉపాధిహామీ సిబ్బంది తమ పనితీరును మార్చుకోకుంటే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఖేడ్‌ ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ చాందీబాయి చౌహన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఎంపీపీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పగిడిపల్లి సర్పంచు ప్రసాద్‌, నిజాంపేట సర్పంచు జగన్‌చారి, మాద్వార్‌ సర్పంచు చంద్రకళరాజు మాట్లాడుతూ తాము ఉపాధి హామీ ద్వారా ఎవెన్యు ప్లాంటేషన్‌ పనులు చేపట్టినప్పటికీ బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదని, దీంతో తాము అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఉపాధిహామీ సిబ్బంది పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నెలల తరబడి బిల్లులు చెల్లించక పోవడం ఏమిటని, ఇప్పటికైనా ఉపాధిహామీ సిబ్బంది తమ పని తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు నెలలకోసారి నిర్వహించే ఎంపీపీ సమావేశానికి ప్రధాన శాఖల అధికారులు హాజరు కాక పోవడంతో తాము గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి తెలుపాలని ప్రశ్నించారు. దీంతో సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పగిడిపల్లి సర్పంచు ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యుత్‌ మోటార్లు లేకపోయిన విద్యుత్‌ అధికారులు బిల్లులు పంపుతున్నారని, దీంతో గ్రామ పంచాయతీలకు ఆర్థి క నష్టం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతు బంధు, రైతు బీమా, తదితర పథకాలకు తోడు రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అఽధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. 

ఆడపిల్లల్లో ధైర్యాన్ని పెంచేందుకే కల్యాణలక్ష్మి

ఆడ పిల్లల్లో మనోధైర్యాన్ని పెంపొందించడం కోసమే సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టాడని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖేడ్‌లోని కార్యాలయంలో మండలంలోని 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి, తలపాగా, అంబేడ్కర్‌ చిత్ర పటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి, ఎంపీపీ చాందీబాయి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST