ఇసుక రీచలో అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు : సీఐ

ABN , First Publish Date - 2021-06-20T06:46:37+05:30 IST

మండలంలోని కళ్లుదేవనహళ్లి ఇసుక రీచలో ఇసుక తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం రూరల్‌ సీఐ రాజా హెచ్చరించారు.

ఇసుక రీచలో అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు : సీఐ
కళ్లుదేవనహళ్లి ఇసుక రీచను పరిశీలిస్తున్న సీఐ రాజా

బొమ్మనహాళ్‌, జూన 19 : మండలంలోని కళ్లుదేవనహళ్లి ఇసుక రీచలో ఇసుక తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం రూరల్‌ సీఐ రాజా హెచ్చరించారు. శనివారం ఆయన ఇ సుక రీచను పరిశీలించి మాట్లాడారు. నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వకాలు జరపకూడదని జయప్రకాష్‌ ప వర్‌ వెంచర్స్‌ నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం పెట్టిన ధర టన్నుకు రూ.475 ప్రకా రం విక్రయించాలన్నారు. 

Updated Date - 2021-06-20T06:46:37+05:30 IST