పశువులను అక్రమ రవాణా చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-07-01T06:03:37+05:30 IST

పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిణీ ప్రిదయర్శిని హెచ్చరించారు.

పశువులను అక్రమ రవాణా చేస్తే చర్యలు

జిల్లాలో మూడు చోట్ల చెక్‌పోస్టులు: మెదక్‌ ఎస్పీ

మెదక్‌ అర్బన్‌. జూన్‌ 30: పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిణీ ప్రిదయర్శిని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీసు, పశుసంవర్ధక, మున్సిపల్‌ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 10న జరగబోయే బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆవులు, లేగదూడల అక్రమ రవాణాను ఆరికట్టాలన్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి ధ్రువీకరించిన పశువులను మాత్రమే వధశాలలకు తరలించాలన్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో తూప్రాన్‌, నర్సాపూర్‌, బోడ్మట్‌పల్లి వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ... జంతు సంరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో పశువైద్యాధికారి విజయకృష్ణారెడ్డి, జిల్లా రవాణాధికారి శ్రీనివా్‌సగౌడ్‌, పోలీసు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-01T06:03:37+05:30 IST