ప్రచారం చేసే వలంటీర్లపై చర్యలు

ABN , First Publish Date - 2021-03-07T05:05:59+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే వార్డు వలంటీర్లపై ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనగా భావించి వారిపై ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రచారం చేసే వలంటీర్లపై చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

ఫిర్యాదులకు కాల్‌ సెంటర్లు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మార్చి 6: మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే వార్డు వలంటీర్లపై ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనగా భావించి వారిపై ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వార్డు వలంటీర్లు ఎక్కడైనా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టు భావిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 0866-2466877కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల కమిషన్‌ మొయిల్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్నయినా సంప్రదించవచ్చునని తెలిపారు. ఆ ఫిర్యాదులపై మున్సిపల్‌ కమిషనర్లు తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. 

పోలింగ్‌ శాతాన్ని పెంచండి

మునిసిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. పార్వతీపురం డివిజన్‌కు చెందిన పీవోలు, ఏపీవోలకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలన్నింటిపైనా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిఒక్కరి దృష్టి సిబ్బంది నడతపై ఉంటుందని గుర్తు చేశారు. అందువల్ల సత్ప్త్రవర్తన, పారదర్శకత ఎంతో ముఖ్యమన్నారు. పీవో, ఏపీవోలకు ఎన్నికల శిక్షణ అధికారి అప్పలనాయుడు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నిబంధనలను వివరించారు. 


Updated Date - 2021-03-07T05:05:59+05:30 IST