అక్రమ లేఅవుట్లపై చర్యలు

ABN , First Publish Date - 2020-12-03T05:08:28+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన అక్రమ లేఅవుట్లపై చర్యలు తప్పవని తహసీల్దార్‌ వి.విజయ్‌కుమార్‌ హెచ్చరించారు.

అక్రమ లేఅవుట్లపై చర్యలు
కవిటి శివార్లలో లేఅవుట్‌ పరిశీలిస్తున్న అధికారులు

కవిటి: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన అక్రమ లేఅవుట్లపై చర్యలు తప్పవని తహసీల్దార్‌ వి.విజయ్‌కుమార్‌ హెచ్చరించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘తోటలు కూల్చేయ్‌..ప్లాట్లు వేసేయ్‌’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించారు. మండలంలో ఎక్కడెక్కడ అక్రమ లేఅవుట్లు ఉన్నాయో పరిశీలించి  సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆర్‌ఐ జీవన్‌కు ఆదేశించారు. ఈమేరకు ఆర్‌ఐ జీవన్‌, కవిటి-1 వీఆర్వో ఎస్‌.నారాయణతో కలిసి కవిటి శివార్లలో కొత్తగా వేస్తున్న లేఅవుట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి, డెవలపర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేఅవుట్‌ వేసి రియల్టర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తెలిపారు.


Updated Date - 2020-12-03T05:08:28+05:30 IST