మాస్కుధరించకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-04-15T05:27:01+05:30 IST

కరోనా వైరస్‌ రెండో దశను తట్టుకునేందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, విధిగా మాస్కు ధరించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచిం చారు.

మాస్కుధరించకుంటే చర్యలు
పార్వతీపురంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వెల్లడి
పార్వతీపురం:
కరోనా వైరస్‌ రెండో దశను తట్టుకునేందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, విధిగా మాస్కు ధరించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచిం చారు. పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని సూచించారు. మాస్కులు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. బుధవారం పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక విలేఖర్లతో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, ఫలితాలు వచ్చేవరకు హోమ్‌ ఐసో లేషన్‌లో ఉండాలని  తెలిపారు. జపాన్‌ నిధులతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరగడం లేదని విలేఖర్లు  తెలపగా,   దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. జేసీ మహేష్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌ తదితరులు ఉన్నారు.  
  వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం
బొండపల్లి: 
కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వో రమణకుమారి ఆదేశించారు. బుధవారం కనిమెరక గ్రామ సచివాలయం వద్ద దేవుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎ.జానకి ఆధ్వర్యంలో  వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె మాట్లాడుతూ... 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు. వ్యాక్సిన్‌ కొరత లేకుండా పటిష్ట మైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో బొండపల్లి వైద్యాధి కారి ఐ.సత్యనారాయణ, ఎంపీడీవో త్రివిక్రమరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 టీకా ఉత్సవ్‌ పరిశీలన
సాలూరు రూరల్‌:
సాలూరులోని రామాకాలనీలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని తహసీల్దార్‌ కె.శ్రీనివాసరావు పరిశీలించారు.  పట్టణ ఎస్‌ఐ ఫకృద్దీన్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. డాక్టర్‌ సురేష్‌చంద్రదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.
  కరోనా కేసులు నమోదు
భోగాపురం:
మండలంలో నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు పోలిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.
చురుగ్గా వ్యాక్సినేషన్‌
పూసపాటిరేగ:
పూసపాటిరేగ, గోవిందపురం, రెల్లివలస పీహెచ్‌సీల పరిధిలో  సీహెచ్‌ అగ్రహారం, కందివలస, కోనాడ, చల్లవానితోటల్లో  45 ఏళ్లు నిండిన వారికి బుధవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేశారు. వాక్సినేషన్‌  కేంద్రాలను  తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌, పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పరిశీలించారు.   భోగాపురం:   పోలిపల్లి సచివాలయ పరిధిలో   540 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌  వేసినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు.     తెర్లాం:   పెరుమాళి పీహెచ్‌సీలో 500 మందికి, ఆమిటి, కూనాయవలస గ్రామాల్లో 529 మందికి కొవిడ్‌ టీకాలు వేశారు.  వైద్యాధికారులు రెడ్డి రవికుమార్‌, డాక్టర్‌ మాధవీలత, ఎంపీడీవో ఎస్‌.రామకృష్ణ, కార్యదర్శి ఎం. అప్పలస్వామి పాల్గొన్నారు.   మెరకముడిదాం :  మెరకముడిదాం పీహెచ్‌సీ వైద్యాధికారి శక్తిప్రియ ఆధ్వర్యంలో ఉత్తరావల్లిలో 450 మందికి, గర్భాం పీహెచ్‌సీ వైద్యాధికారి అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చినబంటుపల్లి సచివా లయంలో 500 మందికి  టీకా వేశారు.     చీపురుపల్లి:   కర్లాం పీహెచ్‌సీ పరిధిలో  500 మందికి వ్యాక్సిన్‌ వేశారు.  పట్టణంలోని మూడో సచివాలయంలో నిర్వహించిన  ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి వాసుదేవరావు సందర్శించారు.  కర్లాం వైద్యాధికారి  సువర్ణ, ఎంపీహెచ్‌ఈవో ఎల్‌. అప్పలనాయుడు పాల్గొన్నారు.  పార్వతీపురంటౌన్‌:  పట్టణంలోని బురాడ వీధిలో బంగారమ్మ సేవా సంఘం భవనంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గౌరీశ్వరికి ఏఎన్‌ఎంలు టీకా వేశారు.    వేపాడ:  బొద్దాం పీహెచ్‌సీ వైద్యాధికారి సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో రామస్వామిపేట, కేజీపూడి, ఓభలయ్యపాలెం, పాటూరు, ముకుందపురం, తదితర గ్రామాల్లో 600 మందికి కొవిడ్‌ టీకా వేశారు. వేపాడ పీహెచ్‌సీ వైద్యాధికారి ధరణి దబ్బిరాజుపేట గ్రామంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేపాడ, వల్లంపూడి, బానాది, జగ్గయ్యపేట, తదితర గ్రామాల్లో సిబ్బంది టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు.   గరుగుబిల్లి:   కొత్తూరు సచివాలయం పరిధిలోని శివ్వాం, కొత్తూరులకు చెందిన 500 మందికి వ్యాక్సిన్‌ వేశామని వైద్యాధికారులు పీఏ ప్రియాంక, కేకే సాగర్‌ తెలిపారు. జియ్యమ్మవలస:   జియ్యమ్మవలస, అల్లువాడ, తాళ్లడుమ్మ, చినమేరంగి, ఎం.అల్లువాడ, అర్నాడ గ్రామాల్లో  500 మందికి టీకా వేశామని డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. సీహెచ్‌వో వరహాలమ్మ, హెచ్‌వీ విజ యమ్మ, సూపర్‌వైజర్‌ సత్యనారాయణ, హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.   కొమరాడ : కొమరాడ  పీహెచ్‌సీ పరిధిలోని కంబవలస, విక్రంపురం సచివాలయాల్లో  వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైద్యుడు పి.అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రస్తుతం సచివాలయాల్లో  500 డోసుల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు.   గుమ్మలక్ష్మీపురం:  ఎల్విన్‌పేట  సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రవికుమార్‌ ప్రారంభించారు.  సచివాలయంలో 150 మందికి వ్యాక్సినేషన్‌ వేశారు.   శృంగవరపుకోట రూరల్‌: ధర్మవరం, గోపాలపల్లి, కొత్తురు, అలుగుబిల్లి సచివాలయాల పరిధిలో  వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. కొట్టాం పీహెచ్‌సీ వైద్యాధికారి ఫణీంధ్ర ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేశారు. జామి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్‌.భాగ్యరేఖ, అలమండ పీహెచ్‌సీ వైద్యాధికారి పద్మజ ఆధ్వర్యంలో  సుమారు 500మందికి టీకాలు వేశారు.

 
 

Updated Date - 2021-04-15T05:27:01+05:30 IST