మహాశివరాత్రికి చురుగ్గా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-03-06T05:52:05+05:30 IST

మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శ్రీముఖ లింగం దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నట్టు ఆలయ ఈవో ఎన్‌.వి.రమణయ్య తెలిపారు.

మహాశివరాత్రికి చురుగ్గా ఏర్పాట్లు

శ్రీముఖలింగం (జలుమూరు):  మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శ్రీముఖ లింగం దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నట్టు ఆలయ ఈవో ఎన్‌.వి.రమణయ్య తెలిపారు.  ఈనెల 11 నుంచి  14 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చేపట్టను న్నారు. 11న మహాశివరాత్రి జాగారం, 12న పడియా, 13న మహా పడియా, 14న వంశధారనదిలో స్వామివారికి చక్రతీర్థ స్నానాలు నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు  చెప్పారు.  భక్తులకు  ఎండ తగలకుండా ఉండేందుకు షామియానాలు, తాటాకుల పందిళ్లు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు.

Updated Date - 2021-03-06T05:52:05+05:30 IST