‘కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉండాలి’

ABN , First Publish Date - 2022-07-02T05:07:46+05:30 IST

ప్రతి టీడీపీ కార్యకర్త పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష అన్నారు. హుకుం పేటలో శుక్రవారం పార్టీ సభ్యత్వాన్ని చేపట్టారు. సభ్యత్వంతో రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు ఇతర సదుపాయాలు పొందవచ్చన్నారు.

‘కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉండాలి’
వజ్రపుకొత్తూరు: సభ్యత్వ నమోదులో పాల్గొన్న గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు: ప్రతి టీడీపీ కార్యకర్త పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష అన్నారు. హుకుం పేటలో శుక్రవారం పార్టీ సభ్యత్వాన్ని చేపట్టారు. సభ్యత్వంతో రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు ఇతర సదుపాయాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మాజీ ఎంపీపీ వసంత స్వామి, మాజీ సర్పంచ్‌ సూరాడ పెంటయ్య తదితరులు పాల్గొ న్నారు. తమకు తితలీ పెంపు పరిహారం అందలేదని స్థానిక మహిళలు, గ్రామస్థులు ఫిర్యాదు చేయగా ఈ విషయమై కలెక్టర్‌కు కలవనున్నట్లు ఆమె చెప్పారు. 


ఆర్టీసీ చార్జీలు మరోసారి పెంచడం దారుణం

పలాస: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు మరోసారి పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల సమ యం లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ రెడ్డి ప్రస్తుతం ప్రజలు మోయలేని భారాన్ని నెత్తిన పెడుతు న్నా రని ఆరోపించారు. విద్యుత్‌ చార్జీలు, ఇంటిపన్ను, వివిధ రకాల సెస్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు. 

 



 

Updated Date - 2022-07-02T05:07:46+05:30 IST