Kamal Haasan: రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ

ABN , First Publish Date - 2022-09-18T14:25:02+05:30 IST

మక్కల్‌ నీది మయ్యం అధికారంలో ఉన్నా, లేకున్నా రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు

Kamal Haasan: రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ

                                     - కోవై రోడ్‌షోలో కమల్‌హాసన్‌


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 17: మక్కల్‌ నీది మయ్యం అధికారంలో ఉన్నా, లేకున్నా రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) పేర్కొన్నారు. కోవై దక్షిణ నియోజకవర్గ పరిధిలోని సెంబట్టి కాలనీ ప్రాంతంలో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. సుమారు 800లకు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఆ ప్రాంతంలో సమస్యలపై ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్‌హాసన్‌ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్‌ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్‌హాసన్‌ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల పెద్దసంఖ్యలో హాజరయ్యారు.


Updated Date - 2022-09-18T14:25:02+05:30 IST