Modi, Mamata Banerjee కి... స్టార్ హీరో కంప్లైంట్!

Published: Sat, 06 Nov 2021 21:00:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Modi, Mamata Banerjee కి... స్టార్ హీరో కంప్లైంట్!

అతనో బెంగాలీ సూపర్ స్టార్. పేరు ప్రసేన్‌జిత్ ఛటర్జీ. అయితే, ఆయన దేశ ప్రధానికి, బెంగాల్ సీఎం మమతకి ఏక కాలంలో కంప్లైంట్ చేయటం ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, ఆయన ప్రధాని, ముఖ్యమంత్రిని కూడా ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది ఎందుకో తెలుసా? స్విగ్గీ వాడు తనకు అనుకున్న సమయానికి ఆహారం డెలివరీ ఇవ్వనందుకట!

Modi, Mamata Banerjee కి... స్టార్ హీరో కంప్లైంట్!

బెంగాలీ చిత్రాల్లో ప్రధానంగా నటించే ప్రసేన్‌జిత్‌కు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా కొన్ని సినిమాల ద్వారా పరిచయమే. కాకపోతే, దేశ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉన్న ప్రసేన్‌జిత్... తనకు, స్విగ్గీకి మధ్య చిన్న గొడవ జరిగితే... పీఎం, సీఎంని రచ్చలోకి లాగటం చాలా మందికి నచ్చలేదు. కొందరైతే ప్రసేన్ను కామెడీగా ట్రోల్ చేస్తున్నారు కూడా...


‘‘తమ రాత్రి భోజనం కోసం ఎవరైనా ఇటువంటి యాప్స్‌పై ఆధారపడితే, వారి గతేంటి... పస్తులుండాల్సిందేనా?’’   అంటూ ప్రసేన్‌జిత్ ఛటర్జీ ఆన్‌లైన్‌లో ఆవేశంగా ప్రశ్నించాడు. మోదీని, మమతాని ట్యాగ్ చేసి ‘‘దీనిపై కాస్త ద‌ృష్టి పెట్టండీ" అంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ, నెటిజన్స్ మాత్రం బెంగాలీ స్టార్ హీరోను ఏకిపారేశారు.  ‘‘ఇది నిజంగా జాతీయ సమస్య!’’ అంటూ ఒకరు వెటకారం చేయగా... ‘‘మోదీకి, మమతా బెనర్జీకి ఇంకేం పనులు లేవు. ఈ స్విగ్గీ వివాదం తక్షణం పరిష్కరిస్తారు’’ అని మరొకరు సెటైర్ వేశారు. ఇక ఇంకొక ట్విట్టర్ యూజర్ అయితే, ‘‘ఇది అంతర్జాతీయ సమస్య. యూఎన్ఓ రంగంలోకి దిగాలి!‘‘ అంటూ ప్రసేన్‌జిత్‌ను ట్రోల్ చేశారు... 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International