
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ను, అతడి తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అందులో సింగర్ సిద్ధూకు పట్టిన గతే సల్మాన్‌కు పడుతుందంటూ హెచ్చరిక ఉంది. దీనికి సంబంధించి సల్మాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంబై బాంద్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ కొనసాగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.