ARYAN KHAN కేస్ తరువాత... తొలిసారి ఫారిన్ షూటింగ్‌కి షారుఖ్ ! ఏ దేశానికి వెళుతున్నాడంటే...

Published: Thu, 11 Nov 2021 15:55:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ARYAN KHAN కేస్ తరువాత... తొలిసారి ఫారిన్ షూటింగ్‌కి షారుఖ్ ! ఏ దేశానికి వెళుతున్నాడంటే...

షారుఖ్ జీవితంలో అక్టోబర్ 2021 ఎప్పటికీ మరిచిపోలేని కాలం! అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ కింగ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో చిక్కాడు. ఇక అక్కడ్నుంచీ అక్టోబర్ నెల మొత్తం తీవ్రమైన మానసిక ఒత్తిడితో గడిచింది బాద్షాకి. అయితే, కేవలం వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు... ఆయన వృతి పరమైన జీవితం కూడా అనూహ్య కుదుపుకు గురైంది. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ నిరవధికంగా వాయిదా పడాల్సి వచ్చింది. కీలకమైన సన్నివేశాలు, పాటల షూటింగ్ ఇంకా మిగిలే ఉంది... 


బాలీవుడ్ మీడియాలో వస్తోన్న తాజా సమాచారాన్ని బట్టీ షారుఖ్ మరోసారి ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విడుదల కావటం, దీపావళి కూడా పూర్తవ్వటంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్ ‘పఠాన్’ ఫారిన్ షెడ్యూల్‌కి ప్లాన్ చేస్తోందట. డిసెంబర్‌లో దీపికతో సహా కింగ్ ఖాన్ స్పెయిన్ విమానం ఎక్కుతాడని బీ-టౌన్ టాక్. అక్కడి బ్యూటిఫుల్ యూరో లోకేషన్స్‌లో రెండు పాటల షూటింగ్‌తో పాటూ కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తారట. చూడాలి మరి, మొదట్నుంచీ అనేక అవాంతరాలు ఎదుర్కొంటోన్న ‘పఠాన్’ మూవీ ఎప్పటికీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని... జనం ముందుకొస్తుందో!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...