మేం పని చేయడానికే కాదు.. ఇవ్వడానికి కూడా.. : నటి

Published: Sun, 23 Jan 2022 08:18:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేం పని చేయడానికే కాదు.. ఇవ్వడానికి కూడా.. : నటి

హలీవుడ్ డైరెక్టర్ సైమన్ కిన్‌బెర్గ్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ ‘ది 355’ జనవరి 21న భారతదేశంలో విడుదలైంది. ఈ చిత్రంలో కథనం ద్వారా మూస పద్ధతులను ధిక్కరిస్తూ, లింగ వివక్షని వేలెత్తి చూపిస్తుంది. ఇందులో సీఐఏ ఏజెంట్ మేస్‌గా నటించడమే కాకుండా ఓ నిర్మాతగా సైతం వ్యవహరించింది నటి జెస్సికా చస్టెయిన్. తాజాగా ఇలాంటి థ్రిల్లర్‌ సినిమాలో హాలీవుడ్‌లోని ఉత్తమ నటీమణులు కలిసి పనిచేయడం గురించి మాట్లాడింది ఈ బ్యూటీ.


జెస్సికా మాట్లాడుతూ.. ‘ఈ ఇండస్ట్రీలో మహిళలను చూసే విధానం గురించి గతంలోనే బహిరంగంగా మాట్లాడాను. నటీమణులంటే పని చేయడానికి మాత్రమే కాదు.. యజమానులుగా పని ఇవ్వడానికి కూడా అని చూపించడానికి ఓ సినిమా తీయడం మాకు చాలా ముఖ్యం. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉండటం ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. దానికి ఎంతో సంతోషం ఉంద’ని తెలిపింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International