
‘దస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘సంజు’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు పొందిన నటి దియా మిర్జా (Dia Mirza). ఈ బ్యూటీ గతేడాది ఫిబ్రవరి 15న బిజినెస్ మెన్ వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. నెలన్నర తర్వాత ఆమె గర్భవతి అనే విషయాన్ని ప్రకటించింది. దీంతో పెళ్లికి ముందే వారి మధ్య ఉన్న శారీరక సంబంధం ఉందని, అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నట్లు అందరూ చర్చించుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) సైతం రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor)తో పెళ్లైన రెండున్నర నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో పెళ్లికి ముందు శృంగారంపై చర్చ మళ్లీ మొదలైంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లికి ముందు శృంగారం అనే విషయంపై దియా మిర్జా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దియా మాట్లాడుతూ.. ‘ఒక మనిషిగా వ్యక్తిగత ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అది వారి ఇష్టం. దానికి వారు దేనికీ భయపడాల్సిన పని లేదు. వారిని భయపెట్టడం, బెదిరించడం కాకుండా అలాంటి వారి నిర్ణయానికి గౌరవం ఇవ్వాలి. వివాహానికి ముందు శృంగారం లేదా వివాహానికి ముందు గర్భం వంటి విషయాలు నచ్చని తిరోగమన ఆలోచనలు ఉన్న చాలామంది వ్యక్తులు ఉండవచ్చు. జనాల నచ్చిన విషయాన్ని ఎంచుకునే హక్కును గౌరవించే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి విషయాలనో ఆధునాతనంగా ఆలోచించే స్థాయిలో ఉన్నామని నేను అనుకోవట్లేదు’ అని చెప్పుకొచ్చింది. కాగా.. వివాహానికి ముందు శృంగారంపై దియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు ఈ భామకి సపోర్టుగా కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం గురించి ప్రకటించి ఎందుకు అన్ని కట్టుబాట్లని బ్రేక్ చేయలేదని ఈ బ్యూటీని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.