కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన Genelia

Published: Fri, 27 May 2022 18:40:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన Genelia

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నటి జెనీలియా డిసౌజా(Genelia D’Souza). ఆమె వెండితెర పైకి తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది. వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజిగా ఉంది. ఈ మధ్యనే ‘మిస్టర్ మమ్మీ’(Mister Mummy) సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. తాజాగా ఆమె కొత్తగా మరో మూవీ షూటింగ్‌ను ప్రారంభించింది. ‘ట్రయల్ పీరియడ్’(Trial Period) సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని మే 27న అభిమానులతో పంచుకుంది.  


జెనీలియా డిసౌజా ‘ఇట్స్ మై లైఫ్’(It's My Life) సినిమా తర్వాత వెండితెర మీద కనిపించలేదు. బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఒకేసారి అనేక ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ‘ట్రయల్ పీరియడ్’ సెట్లోకి అడుగుపెడుతుండటంతో సోషల్ మీడియాలో ఓ మెసేజ్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికీ మార్గంలో ఉన్నాను. ఈ ఏడాది నాలుగో సినిమా ‘ట్రయల్ పీరియడ్’ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని జెనీలియా డిసౌజా తెలిపింది. ‘ట్రయల్ పీరియడ్’ కు అలెయా సేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మానవ్ కౌల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన Genelia


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...