Meena : కీలక నిర్ణయం..!

Published: Mon, 15 Aug 2022 10:16:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Meena : కీలక నిర్ణయం..!

ఆరేళ్ళ వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన మీనా (Meena).. ఆ తర్వాత కథానాయికగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టిన ఈ నటీమణి ఈ జెనరేషన్‌లో కూడా ప్రముఖ హీరోల సరసన కథానాయికగా నటించి మెప్పించారు. ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా.. కీలక ప్రకటన చేశారు. తన అవయవాలను దానం చేస్తున్నట్టు ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా ప్రకటించారు. అవయవదానం అనేది చాలా గొప్ప విషయమని, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంచానికే పరిమితమైన వారికి అవయవదానం రెండో జీవితం లభిస్తుందని తెలిపారు. ఒక్క అవయవదాత ముందుకొస్తే ఎనిమిది మంది ప్రాణాలు నిలుస్తాయన్నారు. అవయవదానం ప్రాముఖ్యత ప్రతీ ఒక్కరూ గుర్తించాలని కోరారు. 


ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా..ఆలోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చేరిన మీనా భర్త విద్యాసాగర్‌ (Vidya sagar) కు సరైన సమయంలో ఊపిరితిత్తులు దొరక్కపోవడంతో చనిపోయారు. అందుకే మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవవయదానానికి ముందుకొచ్చిన మీనాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International