దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీ

ABN , First Publish Date - 2020-12-04T04:30:08+05:30 IST

ఇటీవల తుఫాను కారణంగా పింఛా ప్రాజెక్టు కట్ట తెగి వరద నీటి ఉధృతితో దెబ్బతిన్న పంటలను గురువారం వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీ

సుండుపల్లె, డిసెంబరు3: ఇటీవల తుఫాను కారణంగా పింఛా ప్రాజెక్టు కట్ట తెగి వరద నీటి ఉధృతితో దెబ్బతిన్న పంటలను గురువారం వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి పరిశీలించారు. మండల పరిధిలో పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలైన నుముడుంపాడ, రాయవరం పంచాయతీల్లో వరి, వేరుశనగ తదితర పంటలను మెఎ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద కారణంగా వరి, వేరుశనగతో పాటు ఇతర పంటలకు అపారణస్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారని తెలిపారు. రైతులు అధికా రులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ మురళీధర్‌, ఏఈవో రమణ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:30:08+05:30 IST