ఐపీఎల్ నుంచి ఆడమ్ మిల్నే అవుట్.. శ్రీలంక పేసర్‌తో సీఎస్‌కే ఒప్పందం

Published: Thu, 21 Apr 2022 15:55:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐపీఎల్ నుంచి ఆడమ్ మిల్నే అవుట్.. శ్రీలంక పేసర్‌తో సీఎస్‌కే ఒప్పందం

ముంబై: గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని శ్రీలంక పేసర్ మతీషా పతిరనతో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఈ మేరకు అతడితో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ అధికారికంగా తెలిపింది.


19 ఏళ్ల మీడియం పేసర్ అయిన మతీషా 2020, 2022లలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే అతడితో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ తెలిపింది. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను తలపించేలా బంతులు విసిరే మతీషా ఇప్పటి వరకు రెండు టీ20లు మాత్రమే ఆడాడు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.