విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదర్ పూనావాలా సాయం

ABN , First Publish Date - 2021-08-06T00:15:25+05:30 IST

సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల గురించి రూ. 10 కోట్లు కేటాయించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదర్ పూనావాలా సాయం

న్యూఢిల్లీ: సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల గురించి రూ. 10 కోట్లు కేటాయించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా టీకాను సీరం సంస్థ భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కొవిషీల్డ్‌ టీకాను చాలా మంది తీసుకున్నారు. ఇందులో ఉన్నత చదువులకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే కొన్ని దేశాలు కొవిషీల్డ్‌కు ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఉన్నత చదువుల కోసం ఆయా దేశాలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వారెంటైన్ ఖర్చులు వారికి భారమవుతున్నాయి. ఈ క్రమంలో అదర్ పూనావాలా స్పందించారు. ‘ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులారా.. కొన్ని దేశాలు కొవిషీల్డ్‌ను ఇంకా ఆమోదించలేదు. ఆయా దేశాల్లో మీరు సొంత ఖర్చులతో క్వారెంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకోసం నేను రూ.10 కోట్లు కేటాయించాను’ అని  ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థిక సహాయం కావాల్సిన వారు.. దరఖాస్తు చేసుకోవడానికి ఆయన ఓ లింక్‌ను కూడా షేర్ చేశారు. 


Updated Date - 2021-08-06T00:15:25+05:30 IST