సీఎం కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉంది: అద్దంకి దయాకర్

ABN , First Publish Date - 2022-02-03T19:56:49+05:30 IST

సీఎం కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.

సీఎం కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉంది: అద్దంకి దయాకర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ముఖ్యమంత్రి వెనుక ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ వున్నారన్నారు. అమిత్ షా దగ్గర పనిచేసేటోడు ప్రగతి భవన్‌లో పని చేస్తుండని.. పీకేతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుకోడానికి దొరలు చూస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు బొంద పెట్టె రోజులు దగ్గర పడ్డాయన్నారు. 95 నుంచి 105 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చునని.. బీజేపీ, టీఆర్ఎస్ రెండు దొంగలేనని అద్దంకి దయాకర్ విమర్శించారు.


Updated Date - 2022-02-03T19:56:49+05:30 IST