తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-11-24T10:20:46+05:30 IST

ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం తానేదార్‌పల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని

తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు


స్టేషన్‌ఘన్‌పూర్‌, నవంబరు 23: ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం తానేదార్‌పల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్‌ అనుముల మల్లే్‌షతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యాన్ని తూకం వేస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనల ప్రకారం 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా, అదనంగా 100 గ్రాములను వేయడాన్ని గ్రహించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి స్వయంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, నిర్వాహకులు అవినీతికి పాల్పడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు.


రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు 

పాలకుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులను గురిచేస్తే కఠిన చర్యలుంటాయని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు హెచ్చరించారు. సోమవారం మండల  కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌లో ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.  రెండు లారీలు మిల్లులకు తరలిస్తే ఎందుకు తిరిగి వచ్చాయని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమను పరీక్షించిన తర్వాతే ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు కలిగించినా చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట ఏఆర్‌ఐ కస్నానాయక్‌ ఉన్నారు.


ధాన్యం బస్తాలను వెంటనే తరలించాలి..

జనగామ టౌన్‌: జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డును సోమవారం అదనపు కలెక్టర్‌ బాస్కర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను వెంటనే లిఫ్టింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. యార్డులో మిగిలిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, ఇతర ధాన్యాన్ని అనుమతించవద్దని స్థానిక అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-11-24T10:20:46+05:30 IST