విద్యార్థులకు అదనపు కలెక్టర్‌ బోధన

ABN , First Publish Date - 2022-08-17T04:20:55+05:30 IST

జిల్లా అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ మంగళవారం ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. లింగాపూర్‌ మండలంలోని జాముల్‌ధర్‌ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.

విద్యార్థులకు అదనపు కలెక్టర్‌ బోధన
లింగాపూర్‌లో పాఠాలు బోధిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌

లింగాపూర్‌, ఆగస్టు 16: జిల్లా అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ మంగళవారం ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. లింగాపూర్‌ మండలంలోని జాముల్‌ధర్‌ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు గైర్హాజరుగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుగూడలో అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో నిర్మించిన వాటర్‌ షెడ్‌, నీటి కుంటను పరిశీలించారు. జాముల్‌ధర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులకు పాఠా లు బోధించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

సిర్పూర్‌(యూ): మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ నిర్వాహణ తీరుపై జిల్లా అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల నలుగురు ఉపాఽధ్యాయులు ఎటువంటి సెలవు లేకుండా గైర్హుజరు కావడంలో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడి వారికి మెమోలు జారీ చేయలన్నారు. ఆమె వెంట   ప్రిన్సిపాల్‌ వెంకట్‌స్వామి, భాగ్య, తదితరులు ఉన్నారు.    

Updated Date - 2022-08-17T04:20:55+05:30 IST