నిర్వాసితుల ఖాతాల్లో అదనపు పరిహారం

ABN , First Publish Date - 2022-06-22T05:08:54+05:30 IST

వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారం ఈనెల 27 లోగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని జేసీ విజయ సునీత తెలిపారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, సచివాలయాల్లో సర్వే తీరును మంగళవారం పరిశీలించారు.

నిర్వాసితుల ఖాతాల్లో అదనపు పరిహారం
వలంటీర్ల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ విజయసునీత

జేసీ విజయసునీత

హిరమండలం: వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారం ఈనెల 27 లోగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని జేసీ విజయ సునీత తెలిపారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, సచివాలయాల్లో సర్వే తీరును మంగళవారం పరిశీలించారు. యూత్‌, ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి రూ.లక్ష చొప్పున, రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున మంజూరయ్యాయన్నారు. ఇలాంటి వారు హిరమండలం మండలంలో 8,883 మంది, ఎల్‌.ఎన్‌.పేట మండలంలో 556 మంది, కొత్తూరులో 2,343 మంది ఉన్నారని చెప్పారు. రికార్డులు సక్రమంగా లేవని ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులెవరూ ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో జయరాం, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 


వలంటీర్ల పనితీరుపై జేసీ ఆగ్రహం

హిరమండలం-2 సచివాలయం పరిధిలోని వలంటీర్ల పని తీరుపై జేసీ విజయసునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాల యాన్ని ఆమె సందర్శించారు. ఈ సమయంలో వలంటీర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తంచే శారు. సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా వలంటీర్లు బాధ్యత లేనివిధంగా వ్యవహరిస్తున్నారని, 24 వలంటీర్లుం డగా ఒక్కరే వచ్చారని చెప్ప డంతో వారందరికీ ఫోన్‌ చేసి పిలిపించాలని ఆదేశించారు. ఎవరైనా రాకుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పని చేయని వారిని ఇంటికి పంపేయడం జరుగు తుందని హెచ్చరించారు. 

  

Updated Date - 2022-06-22T05:08:54+05:30 IST