Nirmal: అడెల్లి మహా పోచమ్మక్షేత్రంలో అపవిత్రం

ABN , First Publish Date - 2022-08-28T23:47:30+05:30 IST

పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు అపవిత్రం చేశారు. గర్భగుడిలో కొందరు మద్యం సీసాలు (liquor bottles) పెట్టి పూజలు చేశారు. అంతేకాదు ఫొటోలు ....

Nirmal: అడెల్లి మహా పోచమ్మక్షేత్రంలో అపవిత్రం

నిర్మల్: పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు అపవిత్రం చేశారు. గర్భగుడిలో కొందరు మద్యం సీసాలు (liquor bottles) పెట్టి పూజలు చేశారు. అంతేకాదు ఫొటోలు దిగి స్టేటస్‌లో పెట్టుకున్నారు. జిల్లాలోని అడెల్లి మహా పోచమ్మక్షేత్రంలో (Adelli Maha Pochammakshetra temple) జరిగిన ఈ అపవిత్ర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న కొందరు అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించారు. అమ్మవారి చెంత మద్యం బాటిళ్లు ఉంచి పూజలు చేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి. గర్భగుడిలో మద్యం సీసాలు పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 



Updated Date - 2022-08-28T23:47:30+05:30 IST